pothana
బమ్మెర పోతన గొప్ప కవి , ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతము లో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి వరంగల్ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించారు [ ఆధారం చూపాలి ] . శ్రీ రాముని ఆజ్ఞపై శ్రీ కృష్ణుని కథ, విష్ణు భక్తుల కథలు ఉన్న భాగవతమును తెలుగించారు. ఈ భాగవతము మొత్తము తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఆంధ్రభాగవతమును రచియించిన మహాకవి. ఈయ న ఆఱువేలనియోగి. తండ్రి కేసన. కుమారుఁడు మల్లన. నివాసగ్రామము కడపకు సమీపమున ఉండెడు ఒంటిమిట్టి అనఁబరఁగిన ఏకశిలానగరము. ఇతఁడు కడుపేదవాఁడు. కృషివలన జీవించువాఁడు. ఇతఁడు బాల్యమున పశువులను మేపుచు తమ ఊరిచేరువను కల కొండమీఁద సంచరించుచు ఉండి తన పురాకృత సుకృతవిశేషము వలన చిదానందుఁడు అను ఒక యోగీశ్వరుని కనుఁగొని ఆమహాత్మునికి నమస్కరించి "స్వామీ మీరెవరో మహాత్ములు అని నాకు తోఁచుచు ఉన్న...